Ram Gopal Varma Intresting Comments on Bhola Shankar Movie: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. మామూలుగా ఎంత బాగోక పోయినా అభిమానులు అయినా సినిమాను వెనకేసుకు వస్తారు కానీ ఈ సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఈ చిత్రం ఉందని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయపడుతుండగా కొంతమంది అయితే ఇకమీదట అసలు ఎలాంటి రీమేక్ సినిమాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tiger Nageswara Rao : టైగర్ కి టైమొచ్చింది.. రెడీ అవ్వండి!
ఒక రేంజ్ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియా ‘భోళా శంకర్’పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో కొంతమంది అతిగా మాట్లాడారని అర్ధం వచ్చేలా రామ్ గోపాల్ వర్మ కొన్ని ట్వీట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కొంతమంది పొగడ్తలకు పడిపోయి, కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారని ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చేయడానికి తీసినట్లుంది భోళా శంకర్ అని అంటూ కామెంట్ చేశారు. నిజానికి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా నటించారు. ఈ క్రమంలో రవితేజ వల్లే ఆ సినిమా ఆడిందని ప్రూవ్ చేసేందుకే భోళా శంకర్ చేసినట్లు అనిపిస్తుందని అర్థం వచ్చేలా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్ 😳
— Ram Gopal Varma (@RGVzoomin) August 12, 2023