Tiger Nageswara Rao : టైగర్ కి టైమొచ్చింది.. రెడీ అవ్వండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswara Rao Latest Update: తన కెరీర్లో మంచి జోష్ మీదున్న మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నా ప్రమోషన్స్ అయితే ఇప్పటికే మొదలుపెట్టేశారు. రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోగా ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేశారు. వచ్చే వారం అంటే ఆగస్టు 17న టైగర్ ఆక్రమణ మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా అయిన నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది.
Who Movie: దయ తరువాత ‘హూ’ అంటున్న జేడీ!
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గతేడాది రవితేజ హీరోగా ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అనే మూడు సినిమాలు రిలీజ్ అయితే ధమాకా ఒక్కట్టే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య అయితే మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక రవితేజ హీరోగా నటించి చివరగా వచ్చిన రావణసుర మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేసింది. అందుకే టైగర్ నాగేశ్వరరావుతో హిట్ కొట్టాలని చూస్తున్న రవితేజ ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో, ఆయనకి ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!