హీరోయిన్లతో రిలేషన్… రానా పెళ్లిపై బాలయ్య కామెంట్స్

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్‌స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్‌కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగగా, బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఇద్దరూ ఉల్లాసంగా కన్పించారు. కోవిడ్‌ సమయంలో ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రానా పెళ్లి ఆశ్చర్యం కలిగించిందని బాలకృష్ణ అన్నారు.

Read Also : ‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?

“లాక్ డౌన్ టైములో వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ ?” అని బాలయ్య ప్రశ్నించగా, జీవితంలో అన్నీ చూశానని, అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని రానా చెప్పాడు. “నేను గత పదేళ్లుగా మీ గురించి, మీ సంబంధాల గురించి చాలా గాసిప్స్ వింటున్నాను. చాలా మంది హీరోయిన్ల పేర్లు విన్నాను. మీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వినగానే రానా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ ఎవరని అడిగాను. అమ్మాయి బయటి వ్యక్తి అని, పరిశ్రమకు చెందినది కాదని చెప్పారు. ఈ ట్విస్ట్ ఏంటి రానా?” అని బాలయ్య ప్రశ్నించారు. ఇండస్ట్రీ నుండి అది వర్కవుట్ కాలేదని రానా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఎంత మందిని రిజెక్ట్ చేశారంటూ బాలయ్య అడగ్గా.. రిజెక్ట్ చేసినవాళ్లు చాలా మంది ఉన్నారని రానా బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సాగిన ఒక గంట ఎపిసోడ్ ఫుల్ ఎంటెర్టైన్మెంట్ ను ఇచ్చింది ప్రేక్షకులకు.

Related Articles

Latest Articles