మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. రిలీజ్‌కు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. మరి సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం షూటింగ్ పనుల్లో వేగాన్ని పెంచింది.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
తాజా సమాచారం ప్రకారం, సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కేవలం మరో పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. ఈ చివరి షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారు. ఇక్కడితో పెద్ది షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదే స్పీడ్‌లో మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా పెద్ది టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యాయి. అలాగే.. స్పెషల్ సాంగ్ కోసం రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పాటలో చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి ఇద్దరు స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నాడట బుచ్చిబాబు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
