Site icon NTV Telugu

Peddi : ‘పెద్ది’ లవ్ సాంగ్ అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

Ramcharan

Ramcharan

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్‌, జాన్వీ కపూర్ గ్లామర్‌, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి.

Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు! ఏం జరిగింది?

ముందుగా దసరా సందర్భంగా ‘ఫస్ట్ సింగిల్’ వస్తుందని వార్తలు వచ్చినా, అది విడుదల కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు సానా బుచ్చిబాబు స్వయంగా మంచి వార్త చెప్పి ఫ్యాన్స్‌కి హాయిగా ఊపిరి పీల్చేలా చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “త్వరలో ఒక లవ్ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ పాటకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్‌ అదిరిపోయేలా ఉంటుంది. ఇది మన హార్ట్‌ను టచ్ చేసే మెలోడీగా నిలుస్తుంది” అని వెల్లడించారు. ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. “ఇది దీపావళి గిఫ్ట్‌గా వస్తుందా?” అనే అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే బుచ్చిబాబు మాత్రం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.

‘పెద్ది’ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బుచ్చిబాబు సానా, తన తొలి చిత్రం ‘ఉప్పెన’ ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత తీస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Exit mobile version