పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు జరగనున్నాయి. పవన్ ఫ్యాన్ అయిన సుజిత్ డైరెక్ట్ చెయ్యనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ‘ది ఓజీ’ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ తమన్ చేతికి వెళ్లిందని సమాచారం. తమన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీన్ కాస్త వీక్ గా ఉన్నా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేషన్స్ ఇస్తున్న తమన్ ఇప్పటికే భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి మ్యుజి ఇచ్చాడు. ఈ రెండు సినిమాల్లో తమన్ కొట్టిన బీజీఎంకి పవన్ ఫాన్స్ ఫిదా అయ్యారు. అలాంటి తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే హ్యాట్రిక్ సూపర్ హిట్ ఆల్బమ్ రావడం గ్యారెంటీ.
Read Also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు
అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది ఫాన్స్ కోరుకున్నారు కానీ తమన్ పేరు ఫైనల్ కావడంతో తమన్ కూడా బాగా మ్యూజిక్ ఇస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం ఫైనల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో #FireStormIsComing అనే ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకూ ఈ #FireStormIsComing ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక పూజా కార్యక్రమాలు జరిగితే పవన్ కళ్యాణ్ ఫోటోస్ బయటకి వస్తాయి ఆ టైంలో #PawanKalyan ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఒక సినిమాకి సంబంధించి రెండు టాగ్స్ టాప్ ట్రెండ్ లో ఉంచడం పవన్ కళ్యాణ్ అభిమానులకే సొంతం అని చెప్పాలి.