Ram Charan was seen in Ayyappa Mala:‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రతి చిన్న కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇక తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్టులో రామ్ చరణ్ తన కొత్త గుర్రాన్ని పరిచయం చేస్తూ తాను ఆ గుర్రంతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. బ్లాక్ కలర్ లో ఉన్న గుర్రాన్ని తన న్యూ ఫ్రెండ్ అంటూ ఫ్యాన్స్ కు పరిచయం చేసి దానికి Blaze అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. రామ్ చరణ్ కు హార్స్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక తాజాగా ముంబైలోని ఎయిర్ పోర్టులో అయ్యప్ప మాలలో కనిపించారు రామ్ చరణ్.
Naga Chaitanya-Samantha: విడాకుల తర్వాత మళ్ళీ కలవనున్న సామ్-చై.. ఇదే ప్రూఫ్ అంటూ వీడియో వైరల్!
ఓ యాడ్ షూట్ కోసం అక్కడికి వెళ్లారని అది ఒక ప్రీమియం యాడ్ షూట్ అని తెలుస్తోంది. అలాగే రేపు సిద్దివినాయక దేవాలయాన్ని దర్శించనున్నారని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే బుచ్చిబాబు సానాతోనూ RC16 సినిమా చేస్తున్నారు ఆయన. రామ్ చరణ్ ప్రతి యేటా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో నిష్టగా అయ్యప్పను పూజిస్తూ ఉండే రామ్ చరణ్ ఆ మాలలోనే తన సినిమా పనులు కూడా చూసుకుంటూ ఉంటారు.