Site icon NTV Telugu

Peddi : రామ్ చరణ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..

Ram Charan

Ram Charan

Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్‌ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై చరణ్‌ ఉంచిన ఆ నమ్మకాన్ని ఇప్పుడు మ్యూజిక్ లెజెండ్ నిలబెట్టుకుంటున్నాడు.

Read Also : Peddi : చిరంజీవి ఆర్డర్.. అదరగొట్టిన రామ్ చరణ్‌

తాజాగా విడుదలైన చికిరి సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. పాటలో ఉన్న ఎనర్జీ, ఫోక్ ఫ్యూజన్ టచ్, చరణ్‌ గ్రేస్ కలసి అద్భుతమైన ఫీల్ ఇచ్చాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ లవర్స్ కూడా ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్‌ నమ్మకాన్ని రెహ్మాన్ నిలబెట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్‌ పాటపై మంచి చర్చ జరుగుతోంది. ఇక రాబోయే పాటలు కూడా ఇలాగే ఉంటే మాత్రం కచ్చితంగా క్రేజ్ పెరుగుతుందని అంటున్నారు.

Read Also : SSMB 29 : సమయం ఆసన్నమైంది.. ఫ్యాన్స్ కు మహేశ్ బాబు స్పెషల్ వీడియో

Exit mobile version