మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్‌కి… ఆర్ఆర్ఆర్ తర్వాత కనీసం రెండు సినిమాలు అయినా చేసి ఉండేవాడు కానీ శంకర్ వల్ల గేమ్ చేంజర్‌కు లాక్ అయిపోయాడు చరణ్. చేసేది లేక లేట్ అయినా గానీ… బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మర్‌లో గేమ్ చేంజర్‌కు గుమ్మడి కాయ కొట్టేసి… బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్‌కు కొబ్బరి కాయ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 16 టాలెంట్ హంట్ జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ చేస్తూ సుకుమార్, చరణ్‌తో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్స్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు కానీ చరణ్ బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. చరణ్, భన్సాలీతో ఒక సినిమా చేస్తాడు అనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని నిజం చేస్తూ చరణ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసాడని టాక్. ఇదే నిజమైతే మగధీరలో సర్వ సైన్యాధ్యక్షుడు భైరవగా కనిపించిన తర్వాత చరణ్… కంప్లీట్ పీరియాడిక్ డ్రామా చేయడం ఇదే మొదటిసారి. గుర్రపు స్వారీ అద్భుతంగా తెలిసిన చరణ్ ని రాజుగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాం సంజయ్ లీలా భన్సాలీ.
సంజయ్ లీలా భన్సాలీ… చరణ్ కాంబినేషన్ లో రెడీ కాబోతున్న సినిమా ‘సుహల్ దేవ్’ పీరియాడిక్ వార్ డ్రామా జానర్ లో ఉండనుంది. అమిష్ రాసిన ది లెజెండ్ ఆఫ్ సహేల్ దేవ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన ఈ వీరుడు… 11వ శతాబ్దంలో శ్రావస్తి రాజ్యాన్ని పరిపాలించాడు. రాజపుత్ర వంశానికి చెందిన సహేల్ దేవ్ బర్హాజ్ యుద్ధం అని పిలువబడే బహ్రైచ్ యుద్ధంలో ఘాజీ సయ్యద్ సలార్ మసూద్ నేతృత్వంలోని ఘజ్నవిద్ దళాలపై విజయం సాధించాడు. బహ్రైచ్ యుద్ధం 1034 CEలో గజ్నవిద్ దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు జరిగింది. సుహల్దేవ్, చిన్నదైనా కానీ దృఢమైన సైన్యంతో… చాలా పెద్ద గజ్నవిద్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు, ఆక్రమణదారులను విజయవంతంగా తిప్పికొట్టాడు. ఈ ప్రాంతంలోకి తర్వాత చొరబడాలని ప్రయత్నించిన ఘజ్నావిడ్ చొరబాటుదారులని కూడా సహల్ దేవ్ అడ్డుకున్నాడు. ఇలా భారతదేశం చూసిన అతి గొప్ప రోజుల్లో సహల్ దేవ్ ఒకరు. ఇలాంటి వీరుడి కథతో చరణ్, భన్సాలీ కలిసి సినిమా చేస్తున్నారు అంటే పాన్ ఇండియా కాదు టార్గెట్ పాన్ వరల్డ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.