RRR: ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ పేరే మారుమ్రోగిపోతోంది. నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్లి అక్కడ కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డు ఒక్కటే మినహాయింపు.. మిగతా అన్ని అవార్డులు అన్ని మన ఆర్ఆర్ఆర్ సొంతమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా ఈ సినిమాను మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు దర్శక దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సూపర్ – టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసాకా అక్కడ ఉన్నవారందరూ..స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించారు. ఒక తెలుగు సినిమాకు ఇంత పెద్ద గౌరవం దక్కడం చాలా అరుదు అని చెప్పాలి. ఇక అక్కడ అభిమానులు చూపిన ప్రేమకు రామ్ చరణ్ మంత్రముగ్దుడయ్యాడు. ఈ సందర్భంగా చరణ్.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
Nawazuddin Siddiqui: భార్యా పిల్లలను నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటేసిన స్టార్ నటుడు.. వీడియో వైరల్
ఇక ఈ వేదికపై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ “ప్రేక్షకులు చూపించే ప్రేమ, అభిమానుల ఆదరణే తనను కెరీర్‌లో సుదీర్ఘతీరాలకు నడిపిస్తుంది. మిగిలిన వాళ్లకు కూడా ఇలాగే ఉంటుందా? లేకుంటే నాకు మాత్రం ఇలా ఉందో తెలియదు. కానీ, నటుడిగా ఈ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్షణాల కోసమే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ప్రయత్నం. ఇలాంటి స్పందనే నేను కోరుకున్నాను. ఇంతగా ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు, ప్రశంసిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంత గొప్ప చిత్రంలో నన్ను భాగం చేసిన మా దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే, మగధీర సమయంలో నన్ను నేను విద్యార్థిగానే భావించాను. ఆర్ఆర్ఆర్ సమయంలోనూ అలాగే అనుకున్నాను. ఇదేదో నేను సరదా కోసం చెబుతున్న మాట కాదు. రాజమౌళి గారు నాకు ప్రిన్సిపల్, టీచర్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురువు లాంటి వారు. ఆయన్ను కలిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించిన విషయాలు చాలా తెలుసుకుంటాను. చాలా సమాచారం తెలుసుకున్నట్టు భావిస్తాను. ఆయనతో మాట్లాడితే మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. మరో పదేళ్లకు సరిపడా జ్ఞానం మనకు లభిస్తుంది అని చెప్పుకొచ్చాడు..
Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..
ఇక ఎన్టీఆర్ గురించి చరణ్ మాట్లాడుతూ “ఇప్పుడు నేను, తారక్ చాలా సన్నిహితంగా ఉంటున్నాం. అందుకు ఆర్ఆర్ఆర్ కు ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ వల్ల మేం తరచూ కలిసే వాళ్లం. చాలా సన్నిహితులమయ్యాం. మమ్మల్ని కలపాలనే ఆలోచన రాజమౌళి గారికి కలిగినట్టుంది. అందుకే మమ్మల్ని ఇద్దరినీ ఆర్ఆర్ఆర్ కోసం తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో తారక్ నటించడం వల్ల సోదర భావాన్ని చూపించడం తేలికైంది. తనతో కలివిడిగా ఉండగలిగాను. తారక్‌ని ఆ వేదిక మీద మిస్ అవుతున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది.
What an overwhelmingly happy response to screening of #RRR at the Ace Hotel!
Receiving a standing ovation from you all will be etched in my memory forever!! 🙏🏼❤️❤️
Thank you all so much@ssrajamouli @mmkeeravaani @DOPSenthilKumar @ssk1122 pic.twitter.com/FBxqtINt8P— Ram Charan (@AlwaysRamCharan) March 3, 2023