Rohini: బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కొన్ని వందల సినిమాల్ నటించి మెప్పించింది రోహిణి. ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా మంచి పాత్రల్లో నటిస్తున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటివరకు ఆమె ఎక్కడా చెప్పని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన భర్త రఘువరన్ గురించి ముచ్చటించింది. అతను చాలా సైలెంట్ అని, అతడిని అర్ధం చేసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. ఇక తామిద్దరూ సపరేట్ ఆయిన రెండేళ్లకే రఘువరన్ మృతి చెందినట్లు చెప్పిన రోహిణి.. తన కొడుకు ఆ బాధలో నుంచి బయటపడలేకపోయడని తెలిపింది. రఘువరన్ చనిపోయాక.. కొడుకును షూటింగ్ కు తీసుకెళ్లి కుర్చోపెట్టేదాన్ని అని.. సీన్ అవ్వకముందే తనను పిలిచి.. ” అమ్మా నువ్వు ఈ సినిమాలో చనిపోతావా అని అడిగేవాడు.. నేను అవును అంటే.. వద్దు అలా చేయకు.. ఇప్పటికే నాన్న చనిపోయాడు.. నువ్వు కూడా ఇలా చేస్తే నేను తట్టుకోలేను” అని చెప్పేవాడని, అప్పుడే తనకు అమ్మ ఎంతగా అవసరమో తెలిసీ వచ్చిందని చెప్పింది.
K. Ramalakshmi: కవి ఆరుద్ర సతీమణి కన్నుమూత
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ” సుస్వాగతం సినిమా అప్పుటికీ నాకు, రఘువరన్ కు పెళ్లి అయ్యింది. మా పెళ్లి తరువాత ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్.. చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఈ సినిమా ఆల్రెడీ రఘువరన్.. తమిళ్ లో లవ్ టుడే పేరుతో చేసేశారు. దీంతో అందరం మంచి హిట్ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఎంతో మంచి కథ. ఇక ఆ సినిమా సెట్ కు వెళ్లి వచ్చిన మొదటి రోజు రఘువరన్ వచ్చి.. ఆ అబ్బాయిలో ఏదో ఉందమ్మా.. అని అన్నారు. ఫస్ట్ టైమ్ ఆయన నోటి నుంచే పవన్ కళ్యాణ్ గారి గురించి విని షాక్ అయ్యాను.. చిరంజీవి గారిని నుంచి పెద్ద ట్యాలెంట్ వస్తున్నప్పుడు చాలా దైర్యం కావాలి.. చిరంజీవి గారిని దాటుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలరు అన్నది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్కే. అందులో పవన్ సక్సెస్ అయ్యారు. ఇక ఆ తరువాత జానీ సమయంలో వచ్చి.. తను చాలా క్రేజీ.. ఇలా వచ్చేస్తాడు. చెప్పేస్తాడు.. ఏదైనా అంటే అన్ని మీకు తెలుసు కదా అనేస్తాడు. నా మీద ఎంత నమ్మకం.. కానీ, తన మీద తనకెంత నమ్మకమో కదా అని చెప్పాడు. ఆయన చెప్పినదగ్గరనుంచి నాకు పవన్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇక ఒకసారి పవన్ ను కలిసినప్పుడు రఘువరన్ మీ గురించి ఇలా అన్నారు అని చెప్పగానే.. ఆయన చాలా సంతోషించారు.. నిజమా.. నిజంగానే అన్నారా ..? అని అడిగారు. అవునండీ నిజంగానే అన్నారు అని చెప్పాను. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్ధమవుతోంది. రఘు లానే ఆయన చాలా సైలెంట్.. అందరిలా ఉండరు.. ఒకరు నడిచిన త్రోవలో నడవరు.ఒక పాత్ర కోసం ఫ్లెష్ అండ్ బ్లడ్ ను తీసుకురావడం నేను పవన్ లో చూసాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి