Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. మే 18వ తేదీన ట్రైలర్ లాంచ్ చేస్తామని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఈ ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఎన్టీవీ ముందే చెప్పింది. ఎన్టీవీ చెప్పినట్టుగానే సినిమా ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్‌ను ‘జియో స్టూడియోస్’ సంస్థ చేస్తోంది. ఈ క్రమంలోనే నార్త్ బెల్ట్‌లో సినిమాను ఒక రేంజ్‌లో ప్రమోట్ చేసే బాధ్యతలను కూడా ఆ సంస్థ తమ భుజానికెత్తుకుంది. ఈ క్రమంలోనే ముంబైలో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి జియో స్టూడియోస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ అనంతరం చరణ్ హీరోగా చేసిన సినిమా కావడంతో, నార్త్‌లో కూడా ‘పెద్ది’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం కూడా ఈ సినిమా హిందీ మార్కెట్‌కి మరింత ప్లస్ కానుంది. ఇక ఈ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుని, ముంబై ఈవెంట్‌తో దేశమంతటా ‘పెద్ది’ మేనియా క్రియేట్ చేయాలని జియో స్టూడియోస్ ప్లాన్ చేసింది. మునుపెన్నడూ కనిపించని విధంగా ఊర మాస్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్న ఈ సినిమా ట్రైలర్, ముంబై ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం అని టీమ్ చెబుతోంది.