Ram Charan: వైరల్ అవుతోన్న కొత్త లుక్.. అదిరిందయ్యా చరణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్‌కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్‌గా, రగ్డ్‌గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే! శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌కి సంబంధించిన కొత్త లుక్ బయటకు వచ్చింది. ఈ లుక్‌ని స్వయంగా చరణ్ స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీమ్ ట్విటర్‌లో రిలీజ్ చేశాడు. అతడు రిలీజ్ చేసిన షార్ట్ వీడియోలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. గెడ్డంతో పాటు పొడవాటి జుట్టుతో చరణ్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చరణ్ లుక్ చాలా బాగుండడంతో, అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆరెంజ్’ సినిమా టైంలో స్టైలిష్‌గా కనిపించిన చరణ్.. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత స్టైలిష్ అవతారంలో తళుక్కుమనడంతో ఫ్యాన్స్ ఈ వీడియోని బాగా షేర్ చేస్తున్నారు.
Also Read
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
కాగా.. శంకర్ దర్శకత్వంలో రామ్ చేస్తోన్న సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో చాలామంది పేరుగాంచిన నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
For Our Super Duper @AlwaysRamCharan 🔥🔥🔥
A New Vibe, A New Hairstyle, A New Look 🙌#ramcharan #ramcharanteja #rc #indianfilmindustry #tollywood #bollywood #actor #actorslife #aalimhakim #newlook #hairvibe #star #superstar #reels #reelsinstagram #viral #trending pic.twitter.com/jyipJQokGX
— Aalim Hakim (@AalimHakim) July 2, 2022
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..