Ram Charan: ఒక సినిమా కోసం ఎంతకైనా కష్టపడేతత్వం టాలీవుడ్ హీరోలందరిలో ఉంది. అలాంటి డెడికేషన్ తో ఉంటున్నారు కాబట్టే ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా రేంజులో ఎదిగింది. పాత్ర కోసం బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా.. హెయిర్ కట్ చేయించాలన్నా, పెంచాలన్నా.. పస్తులు ఉండాలన్నా.. అతిగా తినాలన్నా దేనికైనా సిద్ధం అంటున్నారు.ఇక అలా డెడికేటెడ్ గా వర్క్ చేసే హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఒక సినిమా కోసం కష్టపడడంలో రామ్ చరణ్ తనవంతు కృషి చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఒక సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం చరణ్ వర్క్ అవుట్స్ మొదలుపెట్టాడు. తన ట్రైనర్ తో వర్క్ అవుట్స్ చేస్తూ యాక్షన్ సీన్స్ కి రెడీ అవుతున్నాడు. స్విమ్మింగ్, కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చరణ్ పోస్ట్ చేయడంతో అది కాస్తా వేయరల్ గా మారింది. ఏం డెడికేషన్ అయ్యా.. ఎంతైనా మెగాస్టార్ కొడుకువి కదా .. ఆ మాత్రం లేకపోతే ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.