ఎలక్ట్రానిక్ మీడియాలో రామ్ చరణ్ ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే ఆయన “రంగస్థలం” వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలో ఒక న్యూస్ ఛానెల్ కొనుగోలు చేయబోతున్నాడు. ప్రస్తుతం విన్పిస్తున్న రూమర్లలో అది ఏ ఛానెల్ అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ, మహా న్యూస్ అని కొంతమంది అంటున్నారు. ఈ ఛానెల్ కొంతకాలంగా నష్టాల్లో ఉందని, సుజనా చౌదరి, టిజి వెంకటేష్ వంటి రాజకీయ నాయకులు కొంతకాలం పాటు ఈ ఛానెల్‌ని అనధికారికంగా పోషించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆ తరువాత వారు దానిని వదిలించుకున్నారట.
Read Also : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఆ బైక్ ఎవరిదో తెలుసా ?
Also Read
తాజా రూమర్స్ ప్రకారం రామ్ చరణ్ ఈ ఛానెల్ కోసం లాభదాయకమైన ఆఫర్ ను ఇచ్చారట. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఛానెల్ త్వరలో చేతులు మారవచ్చు అంటున్నారు. తమ పార్టీకి మీడియా మద్దతు లేదని ‘జనసేన’ అభిమానులలో అసంతృప్తి ఉంది. అందుకే ఒక న్యూస్ చానల్ ప్రారంభించాలని ఆ అభిమానులు రామ్ చరణ్ ని చాలా కాలంగా అడుగుతున్నారు. న్యూస్ ఛానల్ ప్రారంభించాలన్న రామ్ చరణ్ కోరికలు నిజమవుతాయా ? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. .
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?