Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ స్పీడ్ గా షూటింగ్ అవుతోంది. రంగస్థలాన్ని మించి దీన్ని తీస్తున్నామని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పడంతో ఓ రేంజ్ లో హైప్ పెరిగింది. బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా కోసం ఓ కీలక వ్యక్తిని రామ్ చరణ్ తీసుకొచ్చాడు. తమిళ హీరో విక్రమ్ చేసిన తంగలాన్ భారీ హిట్ అయింది. ఈ సినిమాలో కాస్ట్యూమ్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఆ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన ‘ఎకమ్’ ను ఇప్పుడు పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ తీసుకొచ్చారు.
Read Also : Tollywood : మరోసారి భేటీ కానున్న నిర్మాతలు, ఫెడరేషన్
ఈ విషయాన్ని ఎకమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను తంగలాన్ కోసం పనిచేసిన తీరు రామ్ చరణ్ కు నచ్చి ఈ మూవీకి తీసుకున్నారు. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. పెద్ది సినిమా ఊహించని రీతిలో ఉంటుంది. అందులో కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. రామ్ చరణ్ లుక్ ను బట్టి ప్రతి సనీ్ లో కాస్ట్యూమ్ ను డిజైన్ చేస్తున్నాం అంటూ తెలిపారు ఎకమ్. ఆయన కామెంట్స్ తో పెద్ది మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే కన్నడ స్టార్ శివన్న ఇందులో గౌర్నాయుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. బలమైన యాక్షన్, ఎమోషన్ కలగలిపి ఈ మూవీని ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇప్పటికే వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ భారీ హిట్ అయింది.
Read Also : Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?
