ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మార్చ్ 27న పుట్టిన రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 38 ఏళ్ల చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. నిన్న నైట్ అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ బర్త్ డే పార్టీలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది ఉపాసన. బేబీ బంప్ తో బ్లూ డ్రెస్ లో కనిపించిన ఉపాసనా, చరణ్ బర్త్ ఈవెంట్ లో స్పెషల్ గా నిలిచింది. చరణ్-ఉపాసన వారి ఫస్ట్ బేబీని వెల్కమ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. సుకుమార్, ప్రశాంత్ నీల్, నర్తన్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, రానా, శర్వానంద్, అడవి శేష్, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్, నిఖిల్ సిద్ధార్థ్, మంచు మనోజ్, జగపతి బాబు, నాగార్జున, అమల, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య… ఇతర సెలబ్రిటిలు గెస్టులుగా వచ్చారు.
మెగా ఫ్యామిలీలోని హీరోలు ఈ పార్టీలో ఎక్కువగా కనపడలేదు. అల్లు అర్జున్ కూడా చరణ్ బర్త్ డే పార్టీని స్కిప్ కొట్టినట్లు ఉన్నాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం గత అయిదేళ్లుగా చరణ్-ఎన్టీఆర్ లు కలిసి ఉన్నారు కాబట్టి చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఎన్టీఆర్ వస్తాడని నందమూరి ఫాన్స్ అనుకున్నారు. ఎన్టీఆర్ కొత్త ఫోటోస్ బయటకి వస్తాయి, చరణ్-ఎన్టీఆర్ కలిసిన ఫోటోస్ వస్తాయి అని మ్యూచువల్ ఫాన్స్ వెయిట్ చేశారు కానీ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్ 30 షూటింగ్ స్టార్ట్ చేసే పనుల్లో ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అంతమంది హీరోలు ఉన్న చోట చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించి ఉంటే బాగుండేదని మ్యూచువల్ ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.