కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు చిరంజీవి స్థానాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ భర్తీ చేస్తున్నాడు. చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ వేడుకకు చరణ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు.
Read Also : హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్
నిజానికి చిరంజీవి కరోనా పాజిటివ్ అని ప్రకటించగానే కీర్తి అభిమానులు నిరాశ పడ్డారు. ట్రైలర్లో చెప్పినట్టుగా ‘సఖి’ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పలు కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు విడుదలవుతుంది అనుకుంటున్న తరుణంలో చిరుకు కరోనా రావడం గమనార్హం. అయితే చిరు స్థానాన్ని చరణ్ భర్తీ చేస్తుండడం ఇప్పుడు గుడ్ న్యూస్.