Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోడీని కలిసినట్టు చరణ్ వివరించాడు. ‘ప్రధాని మోడీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల మీద ఉన్న అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుంది’ అంటూ తెలిపాడు రామ్ చరణ్. ఈ లీగ్ లో పాల్గొన్న వారికి స్పెషల్ విషెస్ అని తెలిపాడు రామ్ చరణ్.
Read Also : Pooja-Hegde : హీరోల లాగా హీరోయిన్లకు మర్యాద ఇవ్వరు.. పూజాహెగ్దే కామెంట్స్
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఏపీలో జరుగుతోంది. మొన్నటి దాకా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇక ఉపాసన కూడా తెలంగాణ క్రీడా విభాగానికి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ఇటు పెద్ది సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్లకు వస్తున్నాడు. ఇక సుకుమార్ తో చేసే సినిమా ఫస్ట్ షెడ్యూల్ వచ్చే ఫిబ్రవరిలో మొదలవుతుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Deepika Padukone : దీపిక పదుకొణె చెప్పిన స్టార్ హీరో అతనేనా..?