Rajasekhar to act as Father to Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మహానుభావుడు తర్వాత ఆయనకు సరైన హిట్టు పడలేదు. ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు చేశారు. కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు ఇక ఆ తరువాత ఒకే ఒక జీవితం అంటూ చేసిన తమిళ -తెలుగు బైలింగ్వెల్ మూవీ తమిళ్ లో బాగానే వర్కౌట్ అయినా తెలుగులో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం శర్వా ఆదిత్య దర్శకత్వంలో బేబీ ఆన్ బోర్డు అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక జి ఫైవ్ లో స్ట్రీమ్ అవుతున్న లూజర్ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. రెండు వారాల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
Director Krish: డైరెక్టర్ క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు?
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో శర్వానంద్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంకెవరో కాదు, యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో ఒక కీలకమైన వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ఆయన ఈ మధ్యనే నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు. అది అద్భుతమైన పాత్రాను ముందు నుంచి ప్రచారం చేసినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించారని అందరూ భావించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో అలాంటి తప్పు జరగకుండా ఆయన జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. శర్వానంద్ తండ్రి పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండడంతో ఆ పాత్ర చేయడానికి రాజశేఖర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్ శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ గా చెబుతున్నారు. uv క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గిబ్రన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సమయంలోనే రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కల్పిస్తోంది.