Rakul Jackky Wedding : బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. వీరు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఈ వివాహ వేడుక నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిక్స్ వారే రిలీజ్ చేసే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని కొంతకాలం నుంచి డేట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి వివాహం తల్లితండ్రులు అత్యంత సన్నిహితుల మధ్య గోవాలో జరిగింది. వీరిద్దరూ సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి గ్లామర్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.
Allu Ayaan model bolthey: అల్లు అయాన్.. మోడల్ బోల్తే అంటున్న బన్నీ
రకుల్-జాకీల వివాహం 3 గంటలకు ప్రారంభం అయింది. ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ జంట పెళ్లికి సంబంధించిన మొదటి ఫోటో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట మీడియాను కూడా ఉద్దేశించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. రకుల్ కుటుంబ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని, ఈ జంట మొదట సిక్కు పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సిక్కు వివాహ వేడుకను ఆనంద్ కరాజ్ అని పిలుస్తారు . ఈ జంట సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ చుట్టూ ఏడడుగులు వేశారు.