‘పలాస’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘రక్షిత్ అట్లూరి’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ మూవీలో కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శశివదనే’ రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘శశివదనే’ నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేశాడు. శరవణ వాసుదేవన్ ఇచ్చిన కూల్ బ్రీజ్ లాంటి ట్యూన్ కి కిట్టు విస్సాప్రగడ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసాడు. బ్యూటిఫుల్ గా రాసిన ‘శశివదనే’ టైటిల్ సాంగ్ ని అంతే బ్యూటిఫుల్ గా మార్చింది హరి చరణ్, చిన్మయి శ్రీపాదల వాయిస్. ఈ ఇద్దరూ సాంగ్ కి ప్రాణం పోసారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, టెంపుల్ సెటప్ లో లీడ్ పెయిర్ పైన డిజైన్ చేసిన ‘శశివదనే’ సాంగ్ కి ‘జేడి మాస్టర్’ ఖోరియోగ్రఫి చేశాడు. డీఓపీ సాయి కుమార్ దారా విలేజ్ అట్మాస్పియర్ ని బాగా క్యాప్చర్ చేశారు.
వినడానికి, చూడడానికి బాగున్న ఈ ‘శశివదనే’ సాంగ్ లో అన్నింటికన్నా ఆకట్టుకున్న విషయం లీడ్ పెయిర్ రక్షిత్, కోమలీ ప్రసాద్ ల కెమిస్ట్రీ. ఫుల్ బియర్డ్ లుక్ లో రక్షిత్ రగ్గడ్ గా కనిపిస్తున్నా, కోమలీ ప్రసాద్ మాత్రం కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. ఈ ఇద్దరూ కలిసి ‘శశివదనే’ సాంగ్ ఎండ్ లో మ్యాజిక్ చేశారు. దాదపు వన్ మినిట్ పాటు క్లోజప్స్ లోనే లిరిక్స్ ని పాడుతూ, ఎక్స్ ప్రెషన్స్ ని ఇస్తూ ‘శశివదనే’ సాంగ్ లోని ఫీల్ ని క్యారీ చేసిన విధానం చాలా బాగుంది. ఒక కొత్త హీరోయిన్, రెండు సినిమాలు చేసిన యంగ్ హీరోపైన అంత సేపు ఎక్స్ప్రెషన్స్ పైన సాంగ్ ని తెరకెక్కించడం గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ‘శశివదనే’ లిరికల్ సాంగ్ కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది అంటే దానికి కారణం హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్ లోని బ్యూటీ, సింగర్ చిన్మయి వాయిస్, సాయి కుమార్ కెమెరా వర్క్ అండ్ ‘జేడి మాస్టర్’ ఖోరియోగ్రఫి. మొత్తానికి టైటిల్ సాంగ్ తో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన ‘శశివదనే’ టీం ఇదే జోష్ ని కంటిన్యు చేస్తే రిలీజ్ సమయానికి మంచి అంచనాలని సెట్ చేసే ఛాన్స్ ఉంది.