Rakshit Atluri’s “Narakasura” is getting a grand release in theaters on November 3: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” రిలీజ్ కి రెడీ అయింది. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్న ఈ “నరకాసుర” సినిమాను నవంబర్ 3న ఉషా పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక క్రమంలో డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ – లాక్ డౌన్ లో అంతా షట్ డౌన్ అయినప్పుడు మా నిర్మాతలు రఘు, శ్రీనివాస్ నన్ను పిలిచి ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారని, రెండేళ్లు “నరకాసుర” సినిమా కోసం మా టీమ్ అంతా కష్టపడ్డాముని అన్నారు. గత నెలలోనే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది, ఇన్ని రోజుల కష్టం ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుంది అని టెన్షన్ పడ్డామని అన్నారు.
Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్
రెండు వేలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా సినిమాను నవంబర్ 3న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ సినిమాకు నేను డైరెక్షన్ చేయడంలో ప్రతి ఒక్క టీమ్ మెంబర్ సపోర్ట్ చేశారని అన్నారు. రక్షిత్ రెండేళ్లు ఒకే గెటప్ మెయింటేన్ చేశాడని, రక్షిత్ వాళ్ల నాన్న నన్నూ వాళ్ల అబ్బాయిలాగే చూసుకున్నాడని అన్నారు. “నరకాసుర” మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. మీరు పోస్టర్ , టీజర్ లో చూసిందే కాదు సినిమాలో ఆశ్చర్యపరిచే అంశాలుంటాయని అన్నారు. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ”నరకాసుర” మేమందరం గర్వపడే సినిమా అవుతుందని చెప్పగలను. నాకు ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని మంచి సినిమాలు చేసి తెచ్చుకునే గుర్తింపే నా బ్యాక్ గ్రౌండ్ అనుకుంటున్నానని అన్నారు. లండన్ బాబులు, పలాస, “నరకాసుర” , రాబోయే శశివదనే, ఆపరేషన్ రావణ్ ఈ సినిమాలన్నీ కొత్త కథలతో, కాన్సెప్టులతో ఉంటూ నాకు మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నానని అన్నారు.