Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ప్రస్తుతం రాఖీ, లవర్ అదిల్ దురానీ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ భామ తనకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని డైరెక్టర్లను వేడుకొంటుంది. “నాకు ఎప్పుడు రేప్ సీన్లు, కిస్ సీన్లు మాత్రమే ఇస్తున్నారు. శృంగారినికి మాత్రమే పనికొస్తా అని వారందరు అనుకుంటున్నారు. కానీ, నేను మంచి నటిని, మంచి డ్యాన్సర్ ను, ఎన్నో ఐటెం సాంగ్స్ చేశాను. అయినా అవేమి వారు చూడడం లేదు. అభ్యంతరకరమైన సన్నివేశాలను నాతో చిత్రీకరించి, వాటిని కొన్నిసార్లు ఎడిటింగ్ లో తీసేస్తున్నారు. దీనివలన నాకు వచ్చే పేరు పోతోంది.
దయచేసి అలాంటి పాత్రలే కాకుండా నటిగా నన్ను నిరూపించుకొనే పాత్రలు ఇవ్వండి. నా నటనను చూపించడానికే మీడియా ముందు ఇలా చిట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతున్నాను. ఇక బాలీవుడ్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఎక్స్ పోజింగ్ తప్పదు. అలా చేయడం వలన ట్రోల్స్ వస్తున్నాయి అంటే.. రానివ్వండి. వాటి వలనే మన గురించి అందరికి తెలుస్తోంది. ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావ్.. కొంచెం కూడా సిగ్గులేదా.. ఎక్స్ పోజింగ్ ఆపి ఇంట్లో కూర్చో అని కామెంట్స్ చేస్తుంటారు. నేను వారు ఏదో అన్నారని మారను.. నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. ఇంకా చెప్పాలంటే ఇలా ఒళ్లంతా కనిపించేలా డ్రెస్ చేసుకుంటున్నాను కాబట్టే ఇండస్ట్రీలో అంతో ఇంతో గుర్తింపు నాకు వచ్చింది. ఈ గుర్తింపు కోసం నేను ఎంతో కష్టపడ్డాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాఖీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.