Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చూస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవని చెప్పేస్తారు. కొన్ని రోజులు పెళ్లి అంటుంది.. ఇంకొన్ని రోజులు విడాకులు అంటుంది.. మరొకరితో ప్రేమ.. అతడి కోసం ఎదురుచూపులు.. ఇక ఇవన్నీ ఆగిపోయి చక్కగా పెళ్లి చేసుకుంది అని ఆనందించేలోపు. తన భర్త తనను వేధిస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హిందీ బిగ్ బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్న రాఖీ.. జనవరిలోనే అదీల్ దురానీని వివాహమాడింది. అతనితో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ అప్పుడు కూడా పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. ఎయిర్ పోర్టులో అతని రాక కోసం నిద్రాహారాలు మానేసి ఎదురుచూసింది.అతను నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టింది. ఇక ఆ తరువాత రోజు అతను రావడంతో హాగ్ చేసుకోని ముద్దు పెట్టి.. అతడే నా ప్రేమికుడు అని చెప్పుకొచ్చింది. అసలు ఈమె ప్రేమ ఏంటో.. పెళ్లి ఏంటో అనుకొనేలోపు సీక్రెట్ గా అదీల్ దురానీని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.
హమ్మయ్య.. ఎలా అయినా పెళ్లి అయిపోయింది. ఇక ఈ సమస్యలేమీ ఉండవులే అనుకున్నంత సమయం పట్టలేదు.. పెళ్లి అయ్యి రెండో నెల కూడా ఇంకా ముగియలేదు.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి మరోసారి షాక్ ఇచ్చింది. అదీల్ దురానీ.. వేరే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడని, తన వద్ద ఉన్న డబ్బు మొత్తం తీసుకొని తనను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన తల్లి మరణానికి అదీల్ దురానీనే కారణమని, బిగ్ బాస్ షో కోసం తన తల్లిని అతని వద్ద విడిచిపెట్టి వెళ్లి తప్పుచేసానని, వచ్చేసరికి తన తల్లిని చంపేశాడని ఆరోపణలు చేసింది. అందుకే అతడికి బయట ఉండే అర్హత లేదని. పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం విన్న అభిమానులు ఏం అక్కా.. రెండు నెలలో ఇంత విధ్వంసమా.. వామ్మో అని కొందరు.. ఇకనైనా ప్రేమ పెళ్లి అని కాకుండా సైలెంట్ గా ఉండు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.