Rakesh Master:సాధారణంగా ఒక మనిషి చనిపోతే.. కొంతకాలం మాత్రమే గుర్తుంటారు. కానీ, ఒక నటుడు చనిపోతే.. వారు చనిపోయినా కూడా.. వారు నటించిన సినిమాల ద్వారా నిరంతరం జీవిస్తూనే ఉంటారు. ఎంతోమంది నటులు భౌతికంగా లేకపోయినా.. వారు నటించిన సినిమాలతో జీవించే ఉంటారు. ఒక నటుడును గుర్తుంచుకోవడానికి 100 సినిమాలు చేయనవసరం లేదు.. ఒకే ఒక్క హిట్ సినిమా చేసినా చాలు. రాకేష్ మాస్టర్ ను కూడా ప్రేక్షకులు అలానే గుర్తుంచుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ గా రాకేష్ మాస్టర్ తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఎన్నో మంచి సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. డ్యాన్స్ షోలకు జడ్జిగా చేశాడు. అయితే కొన్ని కారణాల వలన రాకేష్ మాస్టర్ కెరీర్ నాశనం అయ్యింది. ఇక యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు నిత్యం ఏదో ఒక మీమ్ లో కనిపిస్తూనే ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే.. రాకేష్ మాస్టర్ చివరిగా నటించిన చిత్రం హనుమాన్.
సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాలో రాకేష్ మాస్టర్ కూడా ఒక భాగమయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పులిరాజుగా రాకేష్ మాస్టర్ కనిపించాడు. ఊరి పెద్ద గజేంద్ర కి చెంచాగా.. ఊర్లో ఆయన పేరు చెప్పుకొని పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. రాకేష్ మాస్టర్ కనిపించేది రెండు మూడు సీన్స్ లోనే కానీ, ఉన్నంత వరకు తనదైన నటనతో మెప్పించాడు. ఒక హిట్ సినిమాలో రెండు మూడు సీన్స్ చేసినా చాలు.. ఫేమస్ అవ్వడం ఖాయం. సినిమా హిట్ టాక్ అందుకుంది. అది చూడకుండానే రాకేష్ మాస్టర్ కన్నుమూశాడు. ఒకవేళ ఆయనే కనుక బతికి ఉంటే.. ఈ సినిమా తరువాత ఆయనకు మంచి మంచి పాత్రలు వచ్చేవి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రాకేష్ మాస్టర్ ను తెరమీద చూసిన అభిమానులు.. మరోసారి ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఇకపోతే గతేడాది జూన్ లో ఆయన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే.