కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం “అన్నాత్తే”. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతాయి. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “అన్నాత్తే”కు తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆయన చేతిలో కత్తిని పట్టుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
Read Also : ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసిన సీత
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నటిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఆయనకు సోదరిగా కనిపించనుంది. మీనా, ఖుష్బు కీలక పాత్రల్లో నటించారు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ నిర్మాత నారాయణదాస్ నారంగ్, మరో టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ సినిమా తెలుగు, తమిళ హక్కులను దక్కించుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బృందం సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. దీపావళి సందర్భంగా నవంబర్ 4 న ‘పెద్దన్న’ సినిమా తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల అవుతుంది.