రజినీకాంత్ హీరోగా వచ్చిన ప్రతి సినిమా ఎక్కువ మంది అభిమానులను థ్రిల్ చేయడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి అనుకూలంగా ఉండడం ముఖ్యమని చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన చివరి మూవీ ‘కూలీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారట . ఎందుకంటే ‘కూలీ’ కి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ కావడం వల్ల, థియేటర్లలో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల వద్ద రీచ్ అవ్వలేకపోయింది. ప్రారంభ రోజుల్లో మంచి కలెక్షన్లు వర్వాలేదు అనిపిచినప్పటికి, మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని కోలీవుడ్‌లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన తర్వాతి చిత్రాల కోసం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పథంలో కొనసాగుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘జైలర్-2’ సినిమాలో నటిస్తున్నారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి కలిసిన TFJA, జర్నలిస్టుల సంక్షేమం పై స్పెషల్ చర్చ
దర్శకుడు సుందర్ సి కొన్ని కథలపై ఆయనతో చర్చించగా, రజినీకాంత్ ఇకపై తన సినిమాల్లో A రేటెడ్ అంశాలు దూరంగా ఉంచే విధంగా జాగ్రత్త పడుతున్నారని ఇన్ సైడ్ టాక్ . అంటే అర్థం రజినీకాంత్ త్వరలో ప్రేక్షకుల ముందుకు సమస్త వయసుల వారు ఆనందించగల, యాక్షన్-ఎలిమెంట్స్‌తో కూడిన, ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీసుకురాబోతున్నాడు. ఆయన నిర్ణయం టాలీవుడ్‌లో కొత్త దిశా మార్గాన్ని సూచిస్తున్నట్లే.