సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి వచ్చి ఈ రోజుకి వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైన కలెక్షన్స్ ని రాబట్టింది. రోబో 2.0 తర్వాత కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ఉన్న జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబైక్ ఇచ్చింది. ఈ మూవీలో రజినీకాంత్ ని చూసిన ఫ్యాన్స్… రిపీట్ మోడ్ లో థియేటర్స్ లో వెళ్లారు. వింటేజ్ వైబ్స్ ని, ఫ్యాన్ స్టఫ్ ని ప్రాపర్ గా అరెంజ్ చేసి జైలర్ సినిమాని చేసిన నెల్సన్, కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. పొన్నియిన్ సెల్వన్ 2, విక్రమ్ రికార్డుల బూజుదులిపిన జైలర్ సినిమా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్యాక్డ్ థియేటర్స్ ఉన్న సమయంలోనే జైలర్ సినిమాని ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేసారు అనే కామెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇండస్ట్రీ వర్గాలు కూడా జైలర్ ఓటీటీ రిలీజ్ పై కామెంట్స్ చేస్తున్నారు.
కనీసం 45 రోజుల తర్వాత అయినా జైలర్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఓటీటీలో రిలీజ్ చేయడం వలన కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది, తమిళనాడులో మాత్రం ఓటీటీలో రిలీజ్ అయినా కూడా జైలర్ సినిమాని థియేటర్స్ కి వెళ్లే చూస్తున్నారు. ఫ్యాన్స్ థియేటర్స్ లో చూడాలి అనుకుంటున్నా కూడా ప్రొడ్యూసర్స్ ఓటీటీలోకి అంత తొందరగా రిలీజ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. రిలీజ్ ముందే ఓటీటీ అగ్రిమెంట్స్ జరిగి ఉంటాయి కానీ అగ్రిమెంట్స్ చేసే సమయంలో రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాకి కనీసం 6 వారాల గ్యాప్ అయినా మైంటైన్ చేయాలి అప్పుడే ఆ సినిమాకి న్యాయం జరుగుతుంది. అంతే కానీ ఇలా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తే ఇక ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్లడం ఎందుకు. జైలర్ సినిమా ఓటీటీలో లేకపోయి ఉంటే థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు 700 కోట్లు కలెక్ట్ చేసేది, ఈ ఛాన్స్ ని మేకర్స్ మిస్ చేసుకున్నారు.