సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఉంటే హంగామానే వేరు. అందరు హీరోల సినిమాలు పండగ సీజన్ లో, హాలీడే పీరియడ్ లో రిలీజ్ అవుతూ ఉంటే రజినీ సినిమా మాత్రం వస్తే చాలు రాష్టాలకి రాష్ట్రాలే హాలిడే ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హంగామా చేసిన రజినీకాంత్ సినిమా రాలేదు. అందుకే గత దశాబ్ద కాలంగా సూపర్ స్టార్ సినిమా పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. ఈసారి మాత్రం భాషా, కబాలి రోజులని గుర్తు చేస్తుంది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టి సరిగ్గా వారం అయ్యింది, మరో 24 గంటల్లో సినిమా రిలీజ్ కూడా అవుతుంది. ఈ వారం రోజుల్లోనే జైలర్ సినిమా ఒక తుఫాన్ లా అందరినీ కమ్మేసింది. కేవలం ప్రీబుకింగ్స్ రూపంలోనే ఓవర్సీస్ లో జైలర్ సినిమా వన్ మిలియన్ కలెక్ట్ చేసి, కబాలి తర్వాత అత్యధిక ప్రీసేల్స్ రాబట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది అంటే జైలర్ సినిమాపై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
బుక్ మై షో ఆప్ లో వన్ మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి, బెంగళూర్ లో KGF 2 కన్నా ఎక్కువ థియేటర్స్ జైలర్ కి కేటాయించారు, కర్ణాటక డే 1 ముందెన్నడూ చూడని ఒక సెన్సేషన్ చూడబోతున్నామని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, కోలీవుడ్ లో ఇప్పటికే డే 1 హయ్యెస్ట్ గ్రాసర్ గా జైలర్ నిలుస్తుందని బుకింగ్స్ ట్రెండ్ క్లియర్ కట్ గా చెప్తుంది, మలేషియాలో జైలర్ నెవర్ బిఫోర్ హిస్టీరియా సృష్టించబోతుందని ప్రిడిక్షన్ ఉంది. ఇవ్వన్నీ కేవలం అంచనాలు కాదు జైలర్ సినిమా బుకింగ్స్ చూసి చెప్తున్న మాటలు. వారం క్రితం వరకూ ప్రమోషన్స్ కూడా సరిగా జరుపుకొని ఒక సినిమా ఈ రేంజ్ హైప్ సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు. అది రజినీకాంత్ ని మాత్రమే సాధ్యం. 72 ఏళ్ల వయసులో, పదేళ్ల క్రితం హిట్ కొట్టిన ఒక హీరో, బ్యాక్ టు బ్యాక్ డిజప్పాయింట్ చేస్తున్న ఒక హీరో ఈ రేంజులో ఆడియన్స్ ని ఫుల్ చేయడం అంటే మే బీ ఇలాంటి హీరో, ఈ స్థాయి కలిగిన హీరో మరొకరు రారేమో. అందుకే అందరూ అంటారు ఇండియాకి ఒకడే సూపర్ స్టార్… సూపర్ స్టార్ రజినీకాంత్. హైప్ కే కలెక్షన్స్ ఈ రేంజులో ఉంటే, ఈ హైప్ కి హిట్ టాక్ కూడా సొంతం అయితే జైలర్ సినిమా క్రియేట్ చేయబోయే హావోక్ మాములుగా ఉండదు. మరి జైలర్ సినిమాపై ఉన్న హైప్ కి టాక్ కూడా తోడవుతుందేమో చూడాలి.