Laal Salam: అప్పుడే ‘లాల్ సలాం’ పూర్తి చేసేసిన రజినీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth Lal Salaam Shoot Completed: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్ మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మొయినుద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న రజినీకాంత్ ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.
Shah Rukh Khan : నయనతార భర్తకు షారుఖ్ ఖాన్ వార్నింగ్.. విక్కీ షాకింగ్ రిప్లై
Also Read
ఈ విషయాన్ని సినిమా డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘మీతో కలిసి సినిమా చేయడం ఓ అద్భుతం, నాన్నా. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు ‘లాల్ సలాం’లో మొయినుద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’’ అయింది అంటూ అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించగా అదే నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ, బి ప్రవీణ్ భాస్కర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి