Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది. ఈ రోజు ఆయన అవార్డును కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ విషెస్ చెప్పిన స్పెషల్ వీడియోలను ప్లే చేశారు.
Read Also : Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం.. ప్రకటించిన చిరంజీవి
రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు.. కత్తితో కాదురా కంటిచూపుతో చంపేస్తా లాంటి డైలాగులు బాలకృష్ణకు మాత్రమే సెట్ అవుతాయి. ఆయన కోసం అందరూ థియేటర్లకు వస్తారు. ఎలాంటి నెగెటివిటీ లేని వ్యక్తి బాలకృష్ణ. అందుకే ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతోంది. 75 ఏళ్లు పూర్తి చేసుకోవాలని కోరుతున్నా అన్నారు రజినీకాంత్.
అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు బాలకృష్ణ కావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు మీ కృషి, డెడికేషన్ కు నిదర్శనం. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు అమితాబ్ బచ్చన్.
Read Also : Mirai : మిరాయ్ అంటే అర్థం తెలుసా.. అసలు కథ ఇదే