Ilayaraja: రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’కి మాస్ట్రో బాణీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashtipoorthi: రాజేంద్ర ప్రసాద్, అర్చన అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘లేడీస్ టైలర్’ మూవీనే! వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘షష్టిపూర్తి’. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం చెన్నయ్ లోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్ లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్. బి. చౌదరి క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రూపేష్ కుమార్ మా ఆయ్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్ లో ఆ చిత్రాని నిర్మిస్తున్నారు. ‘క్లాప్’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఆకాంక్ష సింగ్ ఇందులో రూపేష్ కుమార్ కు జంటగా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన, ‘కాంతారా’ ఫేమ్ అచ్యుత్ కుమార్, వై. విజయ, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. నాలుగు పాటలున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇదే నెలలో ప్రారంభమై మూడు షెడ్యూల్‌లతో తక్కువ వ్యవధిలో పూర్తి కానుంది. జులై 2023లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం