Rajashekar: టాలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లో జీవిత, రాజశేఖర్ ఖచ్చితంగా నంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాజశేఖర్ లేకుండా జీవితను.. జీవిత లేకుండా రాజశేఖర్ ను చూడడమనేది చాలా రేర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి ఈ జంట బ్రాండ్ అంబాసిడర్. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి అందరికి తెల్సిందే. తలంబ్రాలు సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ జంట మరోసారి తమ లవ్ స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక చిట్ చాట్ షోకు జంటగా వచ్చిన వీరు.. వారి లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులను బయటపెట్టారు. జీవితను మొదటిసారి చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి.. తీసెయ్యండి అని చెప్పినట్లు రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ తరువాత అదే సినిమాలో తనను తీసేసి మరో హీరోతో చేశారని చెప్పాడు. ఇక మూడు సినిమాలు కలిసి చేశాక ఒకసారి రాజశేఖర్ తనవద్దకు వచ్చి.. నాకు ఎక్కడో మీరు నా మీద ఆసక్తి చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది అని చెప్పాడు. ఆ ఫ్రాంక్ నెస్ ఆయనలో నాకు బాగా నచ్చిందని జీవిత చెప్పుకొచ్చింది.
Samantha: నీ కష్టాలకు కన్నీళ్లు పెట్టగలమే కానీ నీ కర్మను పంచుకోలేం
ఇక రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి జీవిత చాలా కష్టపడిందట. ముఖ్యంగా రాజశేఖర్ అమ్మానాన్నలను ఒప్పించడానికి పెద్ద రిస్క్ చేసినట్లు రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.ఈ ప్రేమ వ్యవహారమంతా అయ్యాకా.. మా ప్రేమ విషయం రాఘవేంద్రరావు కు తెలిసి రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు నమ్మకు అంటూ జీవితకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత “నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. హాస్పిటల్ లో చేర్పించి.. సేవలు చేసి మా అమ్మానాన్నల చేత ఓకే చేయించుకుంది” అని తెలిపాడు. ఇక జీవిత సైతం రాజశేఖర్ దొరకడేమో అని ఎంతో బాధపడిందట. మొదట రాజశేఖర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని, ఒకప్పుడు తాను, ఆయన కలిసి కూర్చున్న కారులో ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు ఎంతో బాధగా అనిపించిందని ఆమె ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.