గత మూడేళ్లుగా రూపొందుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ కూడా సినిమాలో భాగం అయ్యారు. టీమ్ మొత్తం ఈరోజు ప్రత్యేక సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో తానే స్వయంగా ప్రదర్శిస్తానని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కరణ్ జోహార్ డీల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా హీరో రణబీర్ కపూర్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Read Also : నాగార్జున ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేసేవాళ్ళం : అలియా
“అందరికీ నమస్కారం… అలియా, అయాన్ ముందుగా ఇక్కడికి రండి… నేను పడిపోతే పట్టుకోవడానికి… తప్పులు మాట్లాడితే సరిదిద్దడానికి… ” అంటూ స్టార్ట్ చేసిన రణబీర్ “ఈ మూవీ స్పెషల్ పీపుల్ తో చాలా స్పెషల్ గా రూపొందింది. రాజమౌళి సర్ సౌత్ లో ప్రజెంట్ చేయడం, సపోర్ట్ చేయడం గ్రేట్ ఫుల్ గా భావిస్తున్నాము. రాజమౌళి నా ఫేవరెట్ డైరెక్టర్… సినిమాటిక్ ఐకాన్స్ అమితాబ్, నాగార్జున సర్ లాంటి వారితో కలిసి పని చేయడం చాలా అరుదుగా దొరికే అవకాశం. నాగ్, అమల గారు సినిమా గురించి, మా గురించి తీసుకున్న కేర్, ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు. మనం డిఫరెంట్ ఏజ్ పీపుల్ అయినా కూడా బాగా కలిసిపోయాము. మీతో ఎవరైనా ఇట్టే కలిసిపోగలరు. ఎవరైనా మీకు స్నేహితులు కాగలరు” అంటూ నాగ్ కు, రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.