Site icon NTV Telugu

SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?

Ssmb 29

Ssmb 29

SSMB 29 : రాజమౌళికి ఏమైంది. అసలేం చేస్తున్నాడు అని షాక్ అవుతున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. మరి లేకపోతే ఏంటండి.. రాజమౌళి సినిమా అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీసేది. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి ఏదైనా పోస్టర్ లేదా సాంగ్, లేదా టీజర్ కే ముందు నుంచే నాలుగైదు అప్డేట్లు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ముందు డేట్ గురించి అప్డేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చాక.. ఆ తర్వాత ఏదో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. కానీ రాజమౌళి ఏంటి ఇలా చడీ చప్పుడు లేకుండా డైరెక్ట్ గా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాడు.

Read Also : Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ కావాలంట.. ఈ హీరోయిన్ కు ఏమైంది..

వాస్తవానికి నవంబర్ 15న పెద్ద ఈవెంట్ ఉంటుంది.. అక్కడే టైటిల్ గ్లింప్స్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ నాలుగు రోజులుగా వరుస అప్డేట్లు వస్తున్నాయి. పృథ్వీరాజ్ లుక్ ను చడీ చప్పుడు లేకుండా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత శృతిహాసన్ పాడిన పాట మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా లుక్.. అసలు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా ఇలా రిలీజ్ చేసేస్తున్నాడు. గతంలో రాజమౌళి ఎన్నడూ ఇలా రిలీజ్ చేయలేదు. అప్డేట్లు ఇచ్చాకనే రిలీజ్ చేసేవాడు. మరి ఇప్పుడు ఏమైందని ఇలా చేస్తున్నాడని అంటున్నారు మహేశ్ బాబు ఫ్యాన్స్. కొంపదీని వేరే ప్లాన్ ఏమైనా ఉందా అంటున్నారు.

Read Also : Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..

Exit mobile version