SSMB 29: వంద కోట్లది ఏముందిలే… ఈ ఇద్దరూ కలిస్తే లెక్క రెండు వేల కోట్ల నుంచి మొదలవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్… ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికైతే 2023లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు కానీ మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో బిజీగా ఉండడం… రాజమౌళి స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు కాబట్టి డిలే అయింది కానీ ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ మూవీని ముందుగా భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ సెట్‌తో పాటు ఆఫ్రికా, యూరప్‌లోనూ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రాజమౌళి లొకేషన్లను కూడా ఫైనల్ చేశాడట. వచ్చే ఏడాది సమ్మర్‌లో షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. మహేష్ బాబు కూడా గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసేశాడు కాబట్టి… కొన్ని రోజులు ట్రైనింగ్ అనంతరం రాజమౌళి ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు. మరి జక్కన్న నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుస్తుందో చూడాలి.
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!