Baahubali 3 : ట్రెండ్ సెట్టర్, గేమ్ ఛేంజర్, భారతీయ సినిమాకు గర్వకారణం… ఈ మూవీ టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసింది. సినిమాతో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ పీక్స్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తో పాటు ఇతర నటీనటులందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరూ Baahubali 3 కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా ? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే ఇటీవల “రాధేశ్యామ్” సినిమా ప్రమోషన్ల సమయంలో ఈ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరో కాంబోలో మరో ప్రాజెక్ట్ రూపొందనుందని, అది ఎప్పుడు అన్న విషయం మాత్రం తనకు తెలియదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు.
Read ALso : Boyapati Srinu : రతనాల సీమపై మాస్ డైరెక్టర్ ఆవేశపూరిత స్పీచ్
అయితే తాజాగా రాజమౌళి కూడా మరోమారు ఈ విషయంపై అప్డేట్ ఇచ్చారు. రాజమౌళి తన తాజా ఇంటర్వ్యూలో “బాహుబలి 3 చేయడానికి ప్రభాస్, నేను, నిర్మాతలు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాము. ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అయితే దాని గురించి నేను ఇప్పుడే పెద్దగా మాట్లాడలేను. కానీ Baahubali 3 కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అద్భుతమైన అప్‌డేట్‌ను త్వరలో అందిస్తాను” అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి చెప్పినట్టుగానే Baahubali 3 రావడానికి చాలా ఏళ్ళు ఎదురు చూడాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల కోసం చూస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయ్యారు. అది పూర్తయ్యాకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తారు రాజమౌళి. ఇక రాజమౌళి ఒక్కో సినిమాకు ఎన్నేళ్లు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు !