Rajamouli : Box office king is back రంగంలోకి రాజమౌళి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ బాక్సాఫీస్ కింగే కాదు.. మాన్‌స్టర్ కూడా అతనే.. రాజమౌళి సినిమా అంటేనే.. వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకే దర్శక ధీరుడి నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. అదే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం అసలు సిసలైన రంగంలోకి దిగాడట. మరి రాజమౌళి ఫస్ట్ స్టెప్ ఏంటి..?
Also Read
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు రాజమౌళి. దాదాపు 1150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ట్రిపుల్ ఆర్.. ఇండియిన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో.. నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో దంగల్, బాహుబలి 2, కెజియఫ్ చాప్టర్ టు నిలిచాయి. అయితే వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్లకు పైగా సాధించిన దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యేందుకు వెకేషన్‌కు వెళ్లాడు రాజమౌళి. అయితే తాజాగా రాజమౌళి ఇండియాకు తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. రావడమే ఆలస్యం అన్నట్టు.. మహేష్ ప్రాజెక్ట్‌పై కసరత్తులు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. తన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి.. స్క్రిప్టు పనులు ప్టార్ట్ చేశాడట జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు లైన్లు అనుకున్న రాజమౌళి.. అందులో ఒకటి లాక్ చేసినట్టు టాక్. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో పడ్టాడని తెలియడంతో.. మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు స్క్రిప్టు ఫైనల్ చేసి.. వచ్చే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మహేష్ బాబు ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను భారీ అడ్వెంచర్ యాక్షన్‌గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..