‘మాస్ మహరాజు’లుగా రాజ్ తరుణ్, సందీప్ మాధవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా, సిమ్రత్ కౌర్, సంపద హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మాస్ మహరాజు’. సిహెచ్. సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం. అసిఫ్ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదు రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమినీ కిరణ్ స్విచ్ఛాన్ చేయగా నిర్మాత సి. కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్. సుధీర్ రాజు మాట్లాడుతూ, ”మనకు సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తున్నారో ఈ సినిమాలో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ అలా ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్ షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
చిత్ర నిర్మాత ఎమ్.అసిఫ్ జానీ మాట్లాడుతూ, ”నేను నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. మూవీ మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది కానీ ఎలా ఏమిటీ అనేది అర్థం కాలేదు. రాజా రవీంద్ర గారు కలసి మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పడంతో ఈ రోజు సినిమా గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. మేము తీస్తున్న ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, ”’వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాల తర్వాత మంచి పవర్ ఫుల్ కథ చెప్పిన డైరెక్టర్ సుధీర్ రాజు గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. అజయ్ విన్సెంట్ కెమెరామెన్ గా, మణిశర్మ సంగీత దర్శకులుగా చేస్తుండం గ్రేట్. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది రాబోతోంది” అని అన్నారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ”దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్తో తీస్తున్నారు. ఇందులో సందీప్ కూడా నటిస్తుండటంతో మూవీ సక్సెస్ పై నమ్మకం వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్లో పూర్తి చేస్తాం” అని చెప్పారు. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా నటించే అవకావం రావడం పట్ల హీరోయిన్ సిమ్రత్ కౌర్ హర్షం వ్యక్తం చేయగా, తెలుగలో తనకిది తొలి చిత్రమని మరో హీరోయిన్ సంపద చెప్పింది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ, ”దర్శకుడు సుధీర్ రాజు చెప్పిన ‘మాస్ మహారాజు’ కథ బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి కథ వినలేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర నిర్మాత చాలా చిన్న వయసులో వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఇప్పుడీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. కొత్తనటులను ఎంకరేజ్ చేసే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్లకి మనమందరం సపోర్ట్ చేయాలి. రాజ్ తరుణ్, సందీప్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ కథ చాలా వెరైటీగా ఉంది” అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?