రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా, సిమ్రత్ కౌర్, సంపద హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మాస్ మహరాజు’. సిహెచ్. సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం. అసిఫ్ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదు రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమినీ కిరణ్ స్విచ్ఛాన్ చేయగా నిర్మాత సి. కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర…