పోర్న్ చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు నిన్న బెయిల్ మంజూరు కాగా, నేడు జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని రూ.9 కోట్లకు కుంద్రా బేరానికి పెట్టారని వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబై శివారులోని ‘మాద్ దీవి’ లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించి.. అక్కడున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఐదు నెలల పాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టును బయట పెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్ షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. కాగా నిన్న రాజ్ కుంద్రాకు రూ. 50,000 పూచీకత్తుపై నిన్న బెయిల్ మంజూరు అవ్వగా, నేడు విడుదల అయ్యారు.