కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్ గా ప్రధాని పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. సినిమాకు ఆమె పాత్రే హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాఖీని ఎదిరించే పవర్ ఫుల్ పాత్రలో పవర్ ఫుల్ లేడీగా ఆమె నటన అద్భుతం.. అందుకే ప్రస్తుతం ఆమె నటనకు అన్నింటా ప్రశంసల వర్షం కురుస్తోంది.
రవీనా టాండన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించగానే.. ఆమె చెప్తున్న డైలాగ్స్ కు అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. తాజాగా ఒక థియేటర్లో రవీనా సీన్ వస్తుంటే ఆమెపై రూపాయి కాయిన్లు విసురుతూ తమ అభిమానిని చాటుకున్నారు పలువురు అభిమానులు. ఆ వీడియోను రవీనా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సినిమా చివర్లో రవీనా టాండన్ చాప్టర్ 3 కి సంబంధించిన పేపర్స్ చూస్తుంటుంది. ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో కొంత మంది రూపీ కాయిన్స్ ని ఆమెపై వెదచల్లారు. “చాలా కాలం తర్వాత స్క్రీన్‌పైకి కాయిన్స్ ఎగరేయడం చూస్తున్నా” అని తెలుపుతూ ఈ సీన్ కి సంబంధించిన షూటింగ్ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.