మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొంతు సవరించుకోబోతున్నాడా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు కూడా తన సినిమాల కోసం పాట పాడలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇటీవల పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మాట వినాలి అనే పాట పాడారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ కూడా తన సినిమాలో ఓ పాట పాడబోతున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది.
Also Read : Thandel : నేడు తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్
గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఆర్సీ 16 మ్యూజిక్ ఆల్బమ్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే RC16లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను రామ్ చరణ్ పాడుతున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో చరణ్ నోట వచ్చే ఆ పాట ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే RC16 మెగాభిమానులకు మరింత స్పెషల్‌గా నిలవనుంది. మరి బుచ్చిబాబు, రెహమాన్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.