రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందిన విషయాన్ని సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కృష్ణంరాజు, ప్రభాస్ తో కలిసి ‘రెబల్’ సినిమా చేసిన రాఘవ లారెన్స్ ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఆయన పార్ధివదేహాన్ని కడసారి చూడలేకపోయిన దురదృష్టంతుడిని అన్నారు. ఆయనను చాలా మిస్ అవుతున్నానని, ఆయన సెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగ భావించి చాలా కేర్ తీసుకునేవారని అన్నారు.
ఇక తిండి విషయమైతే చెప్పనక్కరలేదని, తినని వారికి తల్లిలా కొసరి కొసరి తినిపిస్తారని, ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల ఆయనను కడసారి చూసుకోలేకపోయాననే ఆవేదనను లారెన్స్ వ్యక్తం చేశారు. ఇకపై ఆయన లెగసీ ప్రభాస్ ద్వారా కొనసాగుతుందని భావిస్తున్నట్లు రాఘవ లారెన్స్ తెలిపారు.