Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghavvi: కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన ‘కాంచన-4’, లోకేష్ కనగరాజ్ ‘బెంజ్’, ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కాలభైరవ’లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ కుటుంబం నుంచి మరో క్రేజీ స్టార్ కిడ్ త్వరలోనే సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నరానే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లారెన్స్ కూతురు రాఘవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైందట.
సాధారణంగా స్టార్ల వారసులు, ముఖ్యంగా కూతుళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే హీరోయిన్లుగానో లేదా ప్రొడ్యూసర్లుగానో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ రాఘవి మాత్రం అందరి రూట్‌కు భిన్నంగా ఏకంగా ‘దర్శకురాలిగా’ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని సమాచారం. రాఘవికి చిన్నప్పటి నుంచే సినిమా మేకింగ్, స్క్రీన్ ప్లే పట్ల విపరీతమైన ఆసక్తి ఉందట. దీంతో ఆమె అమెరికా వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు కూడా పూర్తి చేసి భారత్‌కు తిరిగొచ్చారు. పరిశ్రమలో ఎవరైనా డైరెక్టర్ కావాలంటే పెద్ద పెద్ద దర్శకుల దగ్గర ఏళ్ల తరబడి అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి ముందస్తు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, నేరుగా డైరెక్టర్ సీట్లో కూర్చోబోతున్నారు. నేరుగా మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమై ఆమె ఒక రకంగా భారీ రిస్క్ తీసుకోబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అమెరికాలో నేర్చుకున్న టెక్నాలజీ, తనకున్న విజన్ మీదున్న నమ్మకంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
కూతురి పట్టుదలను చూసి లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ మొదటి సినిమాను తన సొంత బ్యానర్‌పై, భారీ బడ్జెట్‌తో తనే స్వయంగా నిర్మించడానికి లారెన్స్ రెడీ అయ్యారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా రెడీ అయినట్లు సమాచారం. గతంలో తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను హీరోగా పరిచయం చేసి సపోర్ట్ ఇచ్చిన లారెన్స్.. ఇప్పుడు తన కూతురిని కూడా డైరెక్టర్‌గా లాంచ్ చేస్తూ తన ఫ్యామిలీ నుంచి మరో కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు అందిస్తున్నారని చెబుతన్నారు. మరి రాఘవి తన మొదటి సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!