రాధికా ఆప్టే.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..రాధికా ఆప్టే సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు మరియు టీవీ షోల్లో కూడా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ రోల్ అయినా సరే ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. ఈ మూవీ గురించి తాజాగా రాధిక కీలక విషయాలు వెల్లడించింది.ప్రస్తుతం తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా `మేరీ క్రిస్మస్`. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే రాధికా గెస్ట్ రోల్ అంటే కనీసం ఐదారు సీన్లలోనైనా కనిపిస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ, ఇందులో ఆమె కేవలం ఒకే ఒక్క సీన్ లో కనిపించనుందట.
రాధిక లాంటి హీరోయిన్ ఒకే ఒక్క సీన్ చేయడం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలిగింది.తాజాగా ఈ సినిమాలో నటించడానికి అసలు కారణం చెప్పింది రాధిక. ఈ చిత్రంలో ఒకే సీన్ లో కనిపించడానికి దర్శకుడు శ్రీరామ్ కారణం అని ఆమె వెల్లడించింది. ఆయన తనకు మంచి ఫ్రెండ్ కావడంతో కాదనలేకపోయినట్లు ఆమె తెలిపింది..ఒక రోజు దర్శకుడు శ్రీరామ్ ఫోన్ చేసి, తన సినిమాలో ఒక పాత్ర పోషించాలని చెప్పారట. అదీ ఒక్క సీన్ లోనే కనిపించాల్సి ఉంటుందని తెలిపారట.ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా కాదనలేకపోయినట్లు వివరించింది.ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ నేను ఉన్నాను. ఆ సెంటిమెంట్ని అలాగే కొనసాగించాలని ఈ సినిమాలో కనిపించాను. ఇందులో నేను చేసింది ఒకే సీన్ అయినా కూడా షూటింగ్ మాత్రం రెండు రాత్రులు కొనసాగింది. దర్శకుడు సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఎంతగా కష్టపడతాడు అనే దానికి ఈ సీన్ షూటింగే నిదర్శనం” అని రాధికా చెప్పుకొచ్చింది.