బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య అతిధులు అని మేకర్స్ తెలపడంతో ఈ వేడుకపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ వేడుకలో జాతిరత్నం నవీన్ పోలిశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మరికొద్ది సేపటిలో ఈ కార్యక్రమం మొదలుకానుంది.