RadheShyam Trailer: ప్రేమ విషయంలో విక్రమాదిత్య విఫలమయ్యాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడేళ్ల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్రమాదిత్య పామిస్ట్ గా కనిపించనున్న సంగతి తెల్సిందే. మొదటి ట్రైలర్ లో ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించిన మేకర్స్ .. సెకండ్ ట్రైలర్ లో మొత్తం విక్రమాదిత్య సక్సెస్ ని చూపించారు.
మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి అని ప్రభాస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. 1 నిమిషం 3 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో విక్రమాదిత్య చెప్పే హస్త సాముద్రికం ఏ రేంజ్ లో నిజమవుతుందో చూపించారు.ఇక చివర్లో ఇంత గొప్పగా చెప్పే పామిస్ట్ తన ప్రేమ విషయంలో తప్పుగా ఆలోచించాడు అని ప్రేరణ చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగించింది. ఇక ఆ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొత్తానికి సెకండ్ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక ముందు నుంచి చెప్తున్నట్లే ప్రేమకు, విధికి మధ్య భీకర యుద్ధం అంటూ చివర్లో చెప్పి ట్రైలర్ ని ఎండ్ చేశారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి మ్యాజిక్ చేయనున్నాడా..? లేదా..? అని చూడాలి.
Also Read
- Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
- 418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
- September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
- Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో...
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!