గుండెల్ని పిండేస్తున్న ‘రాధేశ్యామ్’లోని ‘సోచ్ లియా’ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం అనేది ఇప్పటి వరకూ జరుగుతోంది.
కానీ ‘రాధేశ్యామ్’ ఈ విషయంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే హిందీలో ‘ఆషికీ ఆ గయీ’ పాటను విడుదల చేసిన నిర్మాతలు తాజాగా ‘సోచ్ లియా’ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇలా విడుదలైందో లేదో అలా వైరల్ గా మారిన ఈ పాట ‘రాధేశ్యామ్’ పై పెట్టుకున్న అంచనాలను పదింతలు చేసే విధంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ను ఓ దృశ్య కావ్యంగా దర్శకుడు ‘జిల్’ రాధాకృష్ణ మలిచాడని ఈ పాట చూస్తే అర్థమౌతోంది.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
వింటేజ్ లుక్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఒకరితో ఒకరు పోటీ పడ్డారనిపిస్తుంది. ప్రేరణ ప్రేమ కోసం విక్రమాదిత్య ఆరాటపడటం ఈ పాటలో కనిపిస్తుంది. ఆ వేదన గుండెల్ని పిండేసేలా మనోజ్ పరమహంస తెరపై ప్రెజెంట్ చేశాడు. ఈ బ్యూటిఫుల్ మెలోడీకి మిథున్ స్వరరచన చేయగా, మనోజ్ మింతాసిర్ సాహిత్యం అందించాడు. దీన్ని అర్జిత్ సింగ్ అద్భుతంగా పాడాడు. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. ఆస్కార్ విజేత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేసిన ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో జస్టిస్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!